ఇదేం వంట..
- గురుకులం ప్రిన్సిపాల్ పై ఆగ్రహం
విశ్వంభర, ఇనుగుర్తి: గడ్డల్లా ఉన్న అన్నాన్ని విద్యార్థులు ఎలా తింటారు? ఇదేం వంట అంటూ ఇనుగుర్తి మండలం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ప్రిన్సిపాల్ జయశ్రీ పై దిశా కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత గురుకులంను ఆయన బుధవారం సందర్శించి విద్యార్థులకు తయారుచేసిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం గడ్డలతో కూడి ఉండగా ప్రిన్సిపాల్ ను ఇలా అయితే ఎలా భోజనం చేస్తారన్నారు. గురుకులంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మెయిన్ కుక్ లేకపోవడంతో సిబ్బంది వంట చేస్తున్నారు. రుచిపచిలేని భోజనం బాలికలు భుజించలేకపోతున్నారని మెనూ ప్రకారం వండిస్తూ రోజు ప్రిన్సిపాల్ పర్యవేక్షించాలన్నారు. వెంటనే వంట మాస్టర్ ను నియమించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని,ఆందోళన చేపడుతామని, హెచ్చరించారు.



