ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
విశ్వంభర, హనుమకొండ : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని జన శిక్షణ సంస్థ చైర్మన్ ఆర్ ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లాలోని అంబేద్కర్ భవన్లో జరిగిన జన శిక్షణ సంస్థాన్ వరంగల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళ పారిశ్రామిక ఉత్పత్తి ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ, మా ద్వారా శిక్షణ పొంది తమ సొంతంగా కుటుంబం పోషించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ శిక్షణ శిబిరం 85% మందికి మహిళలకే ఇస్తామని, మేము ఇచ్చిన శిక్షణలో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుచున్నారని, ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా ఉంటుందని అన్నారు. ఈ వేడుకలకు 650 మంది హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ టి శ్రీనివాస్ రఘు, స్టేట్ నోడల్ ఆఫీసర్ సతీష్ రెడ్డి, బోర్డు సభ్యులు గౌడ రమాదేవి, పాము జ్యోతి,కొలిపాక రాణి, నరసింహమూర్తి,హరిప్రసాద్, అన్వేష్,మధు, శ్రీనివాస్ రెడ్డి, సుదీర్ బాబు,హవేలీ రాజు, ఐలయ్య, చందర్, డైరెక్టర్స్, స్టాప్, ఆర్పీలు,తదితరులు పాల్గొన్నారు.



