రిటైర్డ్ ఐఏఎస్ తో సర్పంచి భేటీ
On
విశ్వంభర, నెల్లికుదురు: గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతూ నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బియ్యాల వెంకట పాపయ్య తో ఆ గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు భేటీ అయ్యారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొల్లికొండ బిక్షం, మాజీ విద్యా కమిటీ చైర్మన్ నాగవల్లి బాలరాజు, సీనియర్ నాయకులు బొల్లికొండ నాగరాజుల తో కలిసి సర్పంచి బుధవారం హనుమకొండకు వెళ్లి విశ్రాంత ఐఏఎస్ తో పాటు బియ్యాల దయాకర్ రావు ను కలిసి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తూ అన్ని విధాలుగా సహకారం,తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు.ఈ మేరకు వారు స్పందిస్తూ తమ సహకారం ఉంటుందని చెప్పినట్లు సర్పంచి తెలిపారు.



