కక్కిరేణిలో ఘనంగా ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం

కక్కిరేణిలో ఘనంగా ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం

 

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కక్కిరేణి గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం  పాఠశాల వార్షికోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా చదువుల తల్లి సరస్వతి చిత్రపటానికి పూలతో అనంకరించి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్ జి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ మన ఊరి బడిని మనమే పరిరక్షించుకోవాలని లక్ష్యంతో, ఈ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయుల నిరంతర కృషి, దాతల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ గవ్వ జ్యోతి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు దొడ్డి స్వామి పాల్గొని మాట్లాడుతూ, ఈ గ్రామ పాఠశాల నుండి గురుకుల పాఠశాలకు 10 మంది అర్హత పొందడాన్ని విద్యార్థులను అభినందిస్తూ, ఉపాధ్యాయులను ప్రశంసించడం జరిగింది. పాఠశాల నిర్వహణలో తల్లిదండ్రులు, దాతల భాగస్వామ్యం అద్భుతంగా ఉందని, ప్రవేట్ పాఠశాలల కంటే దీటుగా తమ పెద్దల సహకారంతో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్ఫూర్తివంతమైన సందేశాన్ని సమాజానికి అందిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లా మధురవేణి సురేష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రావు, ఉప-సర్పంచ్ నడిగోటి పాండు, ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ, గ్రామ పెద్దలు పిట్టా రాంరెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణమాచార్యులు, సామజిక కార్యకర్త వేముల సైదులు, ప్రధానోపాధ్యాయులు గణేషు, కృష్ణ, స్వర్ణలత, గోపాల్ రెడ్డి, ప్రశాంతి, పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రులు గుండు సంధ్య, సైదులు, అంకిరెడ్డి కావ్య వెంకట్, చిల్ల భవాని మధు, నడిగోటి సంతోష కమలాకర్, గుండెపూరి మాధవి రాజు, తెడ్ల రాజు, చిల్ల వినయ్, పాపని జయప్రకాష్ తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More పెద్దమ్మ తల్లిని  దర్శించుకున్న కూన శ్రీశైలం గౌడ్

Tags: