నెల్లికుదురు లో ఆశా వర్కర్ల భిక్షాటన

నెల్లికుదురు లో ఆశా వర్కర్ల భిక్షాటన

విశ్వంభర, నెల్లికుదురు: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.18వేలు స్థిర వేతనం నెల నెల చెల్లించాలని, సీనియార్టీ ప్రకారం ఆశాలను ఏఎన్ఎంలుగా, జిఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లికుదురులో ఆశా వర్కర్లు బుధవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘము నాయకులు బత్తిని మహేశ్వరి, టి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కరించాలని 14వ,రోజు భిక్షాటన చేసి నిరసన తెలిపినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.రూ.50వేల బీమా సౌకర్యం కల్పిస్తూ,మృతి చెందిన ఆశా వర్కర్లకు రూ.50 వేలు అంత్యక్రియల ఖర్చుకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్. కవిత,సుజాత,అరుణ,స్వరూప వివిధ గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Tags: