విద్యకు 25 శాతం నిధులు కేటాయించాలి : నల్లా లక్ష్మణ్ 

విద్యకు 25 శాతం నిధులు కేటాయించాలి : నల్లా లక్ష్మణ్ 

విశ్వంభర, బషీర్ బాగ్: విద్యకు బడ్జెట్ లో 25 శాతం నిధులు కేటాయించాలని బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బహుజన ప్రజా శక్తి, బహుజన ప్రజా సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.లక్ష్మి నారాయణ తో కలసి ఆయన మాట్లాడారు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రాధాని మన్మోహన్ సింగ్ తీసుకు వచ్చిన విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ప్రస్తుత బడ్జెట్ లో విద్యకు కేవలం 8.03 శాతం నిధులు కేటాయించడం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్భంద విద్య అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇటీవల నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ కూడా విద్యకు 18 శాతం నిధులు ఇవ్వాలని చెప్పారని గుర్తు చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు కోట్లాదిక రూపాయలు దోచి పెట్టటానికి ఉస్మానియా యూనివర్సిటీని ధ్వంసం చేస్తున్నారని అన్నారు. వెనుక బడిన బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా బడ్జెట్ లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించాయని తెలిపారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు అనుగుణంగా సీట్లను పెంచాలన్నారు. విద్యార్థుల స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలన్నారు. కాంపిటేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అధిక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకరావాలని అన్నారు. గురుకులాల్లో సౌకర్యాలు కల్పించి వాటి సంఖ్యను పెంచాలన్నారు. ఈ సమావేశంలో గోపి రజక, సురేష్, రాజన్న, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: