పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

విశ్వంభర, ముషీరాబాదు:  రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. పింఛన్ సవరణలు, బకాయిల చెల్లింపులు, ఆరోగ్య సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు పెన్షనర్లు మాట్లాడుతూ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పింఛన్లు పెంచాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags: