పెట్రోల్ కొరతపై ఏఐవైఎఫ్ నిరసన

పెట్రోల్ కొరతపై ఏఐవైఎఫ్ నిరసన

విశ్వంభర, హిమాయత్ నగర్‌  : తెలంగాణలో పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. హిమాయత్ నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి వై జంక్షన్ వరకు పెట్రోల్ లేని ద్విచక్రవాహనాలను తోసుకుంటూ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇంధన సరఫరా లోపాలు, బ్లాక్ మార్కెటింగ్ కారణంగా పరిస్థితి విషమించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సరఫరా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెర్లకంటి శ్రీకాంత్, సల్మాన్ బేగ్, నర్సింహా, లక్ష్మణ్, ప్రవీణ్, కుమార్ పాల్గొన్నారు.

Tags: