గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులుగా పెండెం నరేందర్ నియామకం
విశ్వంభర , హైదరాబాద్ :- గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షులుగా పెండెం నరేందర్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ చేతులమీదుగా తుర్కయంజాల్ లోని రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పెండెం నరేందర్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పెద్ద భాధ్యతను నాకు కల్పించిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. చేనేత ఐక్య వేదిక ద్వారా చేనేత రంగం అభివృద్ధి పట్ల , చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతానని అన్నారు. నా నియామకానికి సహకరించిన గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు ఏలే మహేష్ నేతకు , రాష్ట్ర కోశాధికారి జెల్ల రఘు లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సామల స్వప్న , ఉపాధ్యక్షులు జెల్ల పర్వతాలు ,కార్యాలయ కార్యదర్శి సామల మనోహర్ , కర్నాటి అశోక్ , రాపోలు పుండరీకం , రాపోలు జితేందర్ తదితరులు పాల్గొన్నారు.



