క్రమశిక్షణకు నిలయాలు శ్రీ సరస్వతి శిశు మందిరాలు
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: క్రమశిక్షణ, దేశభక్తి సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన విద్యను శ్రీ సరస్వతి శిశు మందిరాలు అందిస్తున్నాయని సరస్వతి విద్యాపీఠం విభాగ్ షై క్షనిక్ ప్రముఖ వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పెద్ద శంకరంపేట లోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లో సంస్కారంతోపాటు జాతీయ వాద విద్యను అందించడం జరుగుతుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు పంచ పరివర్తన కార్యక్రమంలో భాగంగా కుటుంబం పర్యావరణం స్వదేశీ పౌర విధులు సామాజిక సమరసత అంశాలను పాటించాలన్నారు. అనంతరం పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ శిశు మందిరాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని అన్నారు. అనంతరం పలు పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రబంధ గారిని సభ్యులు జంగం రాఘవులు క్రాంతి కుమార్ పున్నయ్య బుగుడాల సాయిలు గాండ్ల సర్వేశ్వర్ ప్రకాశం ప్రధాన ఆచార్యులు లక్ష్మీనారాయణ జైహింద్ రెడ్డి శ్రీనివాస్ ఆచార్య బృందం పోషకులు విద్యార్థులు పాల్గొన్నారు.



