యాప్ డ్రైవర్ల దోపిడీ ఆపాలి 

యాప్ డ్రైవర్ల దోపిడీ ఆపాలి 

 

విశ్వంభర, ముషీరాబాదు : యాప్ డ్రైవర్ల దోపిడీ ఆపాలి అని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ బాబు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పోర్టర్ కమిటీ నిర్వహించిన రెండవ రోజు నిరాహార దీక్షల్లో హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మాట్లాడారు. యాప్ సంస్థలు తక్కువ చార్జీలు ఇచ్చి అధిక కమిషన్ వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ తగ్గించడం, సస్పెన్షన్లు రద్దు చేయడం, ప్రమాద బీమా కల్పించడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహేష్, ఉమేష్ రెడ్డి, సాజిద్, మునీర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Read More పెద్దమ్మ తల్లిని  దర్శించుకున్న కూన శ్రీశైలం గౌడ్

Tags: