జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

విశ్వంభర, సూర్యాపేట: ఈ నెల 28 వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా క్షేత్ర స్థాయి పోలీసు అధికారులతో ఎస్పీ నరసింహ తన కర్యాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. రాజి పడదగిన కేసులను గుర్తించి కేసుల్లో ఉన్న ఇరు వర్గాల వారికి అవగాహన కల్పించాలని, దీని సద్వినియోగం చేసుకుని ఎక్కువమొత్తంలో కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ లోక్ అదాలత్ ను కక్షిదారులు  సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలిపారు. రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల కేసులు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితర కేసులు పరిష్కరించుకోవచ్చు అని వివరించారు. కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.

Tags: