మానవాళికి ఆదర్శ దంపతులు సీతారాములు

మానవాళికి ఆదర్శ దంపతులు సీతారాములు

 విశ్వంభర, సూర్యాపేట: సకల మానవాళికి ఆదర్శ దంపతులు శ్రీ సీతారాములు అని శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. ఈ నెల 27 శుక్రవారం శ్రీ రామనవమి ని  పురస్కరించుకొని సూర్యాపేట శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం లో కల్యాణ తలంబ్రాల కొరకు బియ్యపు గింజలపై శ్రీరామ అని  వ్రాసిన  బియ్యాన్ని శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్షులు బ్రాహ్మాండ్లపల్లి మురళీధర్ కు బుదవారం దేవాలయం లో అందజేశారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ  హైదరాబాద్ కు చెందిన వందన,అనిత అనే భక్తులు గత 2 నెలలు గా సుమారు 3 కిలోల బియ్యం పై  శ్రీ రామ అని వ్రాసిన బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో అందజేస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా శ్రీ వాసవి సేవా సమితి  సభ్యులు చిల్ప నాగభూషణం ద్వారా సేకరించిన బియ్యం   శ్రీ సంతోషిమాత దేవాలయం కు అందజేసినట్లు తెలిపారు. ఎంతో సూక్ష్మమైన బియ్యపు గింజల పై శ్రీ రామ అని వ్రాయడము వారి అమిత భక్తికి నిదర్శనం అన్నారు.శ్రీ రామ అని నామము పలుకుతేనే  సర్వ పాపాలు తొలిగి పోతాయి అని ఎంతో పవిత్ర మైన నామము శ్రీరామ నామం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు అశోక్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Read More రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఎమ్మార్వో గా ఎంపికైన షాబాద్ ఎమ్మార్వో అన్వర్ 

Tags: