పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

విశ్వంభర, ​పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలంలో ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి  వార్షిక పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మండల వ్యాప్తంగా మొత్తం 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాధికారి  నాగేశ్వరరావు రాథోడ్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో సెట్-1, సెట్-2 ప్రశ్నపత్రాలను భద్రపరిచారు.​మొత్తం 3,196 మంది విద్యార్థులు పరీక్షలకుహాజరుకానున్నారు.​బాలురు 1,746 మంది, ​బాలికలు1,450 మంది,  ​​ప్రభుత్వ పాఠశాలలు 10,  ​రెసిడెన్షియల్ పాఠశాలలు 06,  ​ప్రైవేట్ పాఠశాలలు 32 తో పాటు తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరుకానున్నారు.​ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.​పరీక్షా కేంద్రాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను సిద్ధం చేశారు.పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతో పాటు విధుల్లో ఉండే అధికారులు కూడా సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని ఎంఈఓ స్పష్టం చేశారు.​మార్చి 14 నుండి ఏప్రిల్ 15 వరకు జరిగే ఈ పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Tags: