వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజనసభ
On
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ , బ్యాంకు బాధ్యతల ఇన్‌చార్జ్ చాహత్ బాజ్ ఫాయ్ అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకు డిపాజిట్ సేకరణ రుణవితరణలో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, లాభాల దిశగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. రైతులకు మరియు సహకార సంఘాలకు సమయానికి రుణాలు అందజేసి వ్యవసాయ అభివృద్ధికి బ్యాంకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.పాక్స్ యాక్సిలరేటరీ కార్యక్రమం కింద నాబార్డ్ సహకారంతో నాలుగు సహకార సంఘాలకు డ్రోన్లు మరియు జనౌషధి కేంద్రాల స్థాపనకు తక్కువ వడ్డీపై రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇదే మార్గంలో ఇతర సంఘాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారులు సంజీ…



