ఘనంగా ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ వేడుక
విశ్వంభర, నెల్లికుదురు: సమయపాలనలో, సాంఘిక శాస్త్ర బోధనలో విషయ విశదీకరణలో మీకు మీరే సాటి అంటూ పదవీ విరమణ పొందుతున్న స్కూల్ అసిస్టెంట్ బండారి ఎల్లగౌడ్ ను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. 39 సం.లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ తొర్రూరు మండలం మాటేడు జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం కొండేటి ప్రభాకర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పదవీ విరమణ మహోత్సవంలో ఎల్లగౌడ్ పద్మ దంపతులను ఆ గ్రామ సర్పంచి సునీల్ యాదవ్, తో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు, బంధువులు, స్థానిక,వివిధ పాఠశాల టీచర్స్ ఘనంగా సన్మానించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులు ఎల్లగౌడ్ పద్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులను భాజా భజంత్రీలతో పుష్పాలు చల్లుతూ స్వాగతం పలుకుతూ వేదిక వద్దకు తీసుకువచ్చారు.రిటైర్డ్ టీచర్ పంజాల సోమ నరసయ్య ఎల్ల గౌడ్ పై రాసి చదివి న సన్మాన పత్రం ఆకర్షించింది. సార్ రిటైర్డ్ పట్ల విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు.ఎల్లగౌడ్ సార్ మాట్లాడుతూ తన సుదీర్ఘ టీచర్ ఉద్యోగంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యాయులు విద్యార్థులతో ఉన్న అనుబంధం మరువలేనిది అన్నారు.వృత్తిలో నా సమయపాలనకు,విజయాలకు నా సహధర్మచారిని పద్మ కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో ఎం ఈ ఓ లు బుచ్చయ్య,శ్రీనివాస్,పిఆర్టియు జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి,ఎల్లగౌడ్ సార్ సోదరుడు బండారి సోమయ్య, కుటుంబ సభ్యులు బండారి రాజశేఖర్ మౌనిక,రిషిత,వెంకటేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అభిమానులు పాల్గొన్నారు.



