అధ్యయన కమిటీకి పెద్ద శంకరంపేట ఉపాధ్యాయుడు ఎంపిక

అధ్యయన కమిటీకి పెద్ద శంకరంపేట ఉపాధ్యాయుడు ఎంపిక

      విశ్వంభర,పెద్ద శంకరంపేట:  తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలపై అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచస్థాయి ఉత్తమ బోధన పద్ధతులను అధ్యయనం చేపట్టడం కోసం చేపట్టిన టీచర్స్ ఎక్స్ పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా విదేశాలకు పర్యటనకు వెళ్లే  ఉపాధ్యాయుల జాబితాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాన్ విడుదల చేశారు . దీనికి  పెద్ద శంకరంపేటకు చెందిన ఉపాధ్యాయుడు కోయిలకొండ బాలాజీ ఎంపికయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఫిన్లాండ్ దేశంలోని అంతర్జాతీయ ఉత్తమ విద్య ప్రమాణాలు ఉత్తమ బోధన పద్ధతులను పరిశీలించనున్నారు.  ఏప్రిల్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు పర్యటించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న విద్యా విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి ఉత్తమ పద్ధతులను మన విద్య వ్యవస్థలో అమలు చేయడానికి ఈ పర్యటన దోహదపడుతుందన్నారు. ఓరియంటేషన్ ఎంపికైన అభ్యర్థులకు వీసా ప్రక్రియ ఇతర సూచనలపై ఈనెల 25న మధ్యాహ్నం మూడు గంటలకు పర్సువల్ పద్ధతిలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు వివరించారు. పెద్ద శంకరంపేట కు చెందిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద  ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా  పనిచేస్తున్నారు. ప్రపంచ స్థాయి పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుడు బాలాజీని ఉపాధ్యాయులు పలువురు అభినందిస్తున్నారు.

Tags: