శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి 

శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి 

విశ్వంభర,  చింతపల్లి:  ప్రశిక్షణ తరగతులను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చెనమోని రాములు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మార్చి 28, 29 తేదీలలో దేవరకొండ పట్టణంలో బీజేపీ మండల శిక్షణ తరగతుల (రాజకీయ) సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం చింతపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సముద్రాల నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేఖరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,  శిక్షణా తరగతుల కో-ఆర్డినేటర్లతో దేవరకొండలో జరగబోయే మండల ప్రశిక్షణ తరగతులకు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరు అయ్యేలా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ నైతిక సిద్ధాంతాలైన అంత్యోదయ భావన  ఏకాత్మత మానవతావాదం గత 12 సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశిక్షణ అభియాన్ మండల ఇంచార్జ్ శివర్ల రమేష్, ప్రశిక్షణ అభియాన్ మండల సహాయ ఇంచార్జ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెన్నం శేఖర్, బొడ్డు మహేష్, ఎర్ర వెంకటయ్య, సోమరాజు ప్రదీప్, గజ్జ అభినవ్, తాళ్ళపల్లి చంద్రశేఖర్, రాము, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: