దేశమంతటా హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి 

దేశమంతటా హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి 

విశ్వంభర, చింతపల్లి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా భారత దేశమంతటా హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని నల్లగొండ విభాగ్ కాసం సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా చింతపల్లి ఉప మండల కేంద్రంలో నిర్వహించే హిందూ సమ్మేళనానికి సంబంధించి జాగరణ టోలిని ఏర్పాటు చేశారు. ఈ జాగారణ టోలి ఉప మండల పరిధిలోని హిందుత్వ అభిమానులందరిని ఏకం చేసి వారితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా మండల కేంద్రంలో వైభవోపేతంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడానికి యోజన చేశారు. ఈ హిందూ సమ్మేళనం ఆధ్యాత్మిక వేత్తల ఉపన్యాసాలు ధార్మిక కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలతో హిందువులందరిలో సామాజిక సమరసత వెల్లివీరుస్తూ ఆధ్యాత్మిక బంధు భావన పెంపొందించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో గోలి కిరణ్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, బొడ్డు మహేష్, ప్రదీప్, అభినవ్, కృష్ణ, మహేష్ చంద్రశేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.

Tags: