హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

విశ్వంభర,నెల్లికుదురు: మండలంలోని నైనాల గ్రామంలో చట్ల సాయిలు మనవడు చట్ల యాకయ్య పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు ఎండి షాబుద్దీన్, ఎండి ఇమామ్, ఎండి అన్వర్ లు సెంట్రింగ్ కర్రతో తలపై కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. ఇంటి స్థలం గట్టు  విషయంలో సంబంధిత  నిందితులు మంగళవారం బాధితులపై దాడి చేశారని మొబైల్ ఫోన్ ద్వారా తమకు సమాచారం ఇవ్వడంతో వెంటనే బాధితుల ఇంటికి వెళ్లి కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నిందితులను వారి ఇంటి వద్ద అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించినట్లు ఎస్సై తెలిపారు.

Tags: