దివ్యాంగులకు అండగా ఉంటా : కోదండరాం 

దివ్యాంగులకు అండగా ఉంటా : కోదండరాం 

 విశ్వంభర, ముషీరాబాదు: దివ్యాంగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ వంతు కృషి కొనసాగుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. బుధవారం హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని, ఎవరూ అనవసరపునిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ జనసమితి అండగా ఉంటుందని తెలిపారు. పెన్షన్ల పెంపు, ఉద్యోగాలలో ఖాళీల భర్తీ, ఉచిత రవాణా, రాజకీయ రిజర్వేషన్లు, ప్రత్యేక భవనం నిర్మాణం, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దివ్యాంగులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వి. భారతి వరప్రసాద్, ఎండి మున్నా, నాగభూషణం, కొల్లి నాగేశ్వరరావు, వంశీరాజ్ రామచంద్ర, ఎం. నర్సింహ, నల్గొండ శ్రీనివాస్లు, రాజేష్, వీరేసన, కోమర మల్లు, భువనేశ్వర్, రాజ్యలక్ష్మి, కె. నయిమ్, సైదులు పాల్గొన్నారు.

Tags: