వ్యాలిడేషన్ యాక్టు25ను రద్దు చేయాలి
On
విశ్వంభర, పెద్ద శంకరంపేట: వ్యాలిడేషన్ యాక్టు25 రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే వ్యాలిడేషన్ యాప్ 25ను తీసుకువచ్చిందని, ఇటీవల తమ డిమాండ్ మేరకు దాని అమలుపరచకుండా ఉంచిందని, ఆ యాక్టివ్ పూర్తిగా రద్దు చేయాలని ప్రధానమంత్రి కి వినతి పత్రం సమర్పిస్తున్నట్లు వారుపేరుకొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంగం అధ్యక్షులు ఎస్ నరసింహులు గౌరవ అధ్యక్షులు రామచంద్ర చారి ప్రధాన కార్యదర్శి మోహన్ నాయకులు దశరథ్ ఎస్ నారాయణ బి నారాయణ విజయ్ కుమార్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



