పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

విశ్వంభర, సిద్దిపేట: జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ల కొరత లేదని, భయాందోళనలతో కొనుగోళ్లు చేయొద్దని జిల్లా ఫౌర సరఫరాల శాఖ అధికారి తనూజ ప్రజలకు సూచించారు. ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా సక్రమంగా పనిచేస్తోందన్నారు. తప్పుడు వదంతుల వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని తెలిపారు. ప్రజలు భయంతో ఇంధనం కొనుగోళ్లు చేయడం వల్ల సాధారణం కంటే 2.5నుంచి 3రెట్లు విక్రయాలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలు, క్యాన్లలో నిల్వ చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అగ్ని ప్రమాదాలకు జరిగే అవకాశముందని, అక్రమంగా నిల్వ ఉంచి, బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీస్ శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించారు.

Tags: