విజయానికి అడ్డదారులు ఉండవు
- - సక్సెస్ సాధించాలంటే శ్రమ పడాలి
- మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి
-ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణం స్పందన డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కళాశాల యజమాన్యం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నర్సింహా ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విజయానికి అడ్డదారులు ఉండవని విజయం సాధించాలంటే శ్రమ మార్గమని, విద్యార్థులు నిత్యం శ్రమించాలని అన్నారు. ఎంచుకున్న లక్ష్యం సాధించడానికి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అంశాలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. గొప్ప విజయాలు సాధించిన వారి విజయగాతలను ఆదర్శంగా తీసుకోవాలని అబ్దుల్ కలాం జీవితాన్ని ఉద్దేశించి వివరించారు. మంచి భవిష్యత్తుపై యువత కలలు కలనాలని ఆ కలలను సాకారం చేయడంలో నిరంతరం శ్రమించాలని సూచించారు. కష్టపడి చదువుకునే సమయంలో యువత ఆకర్షణలకు గురై బంగారు భవిష్యత్తును కోల్పోవద్దు, చెడు అలవాట్లకు లోనూ కావద్దు అని కోరారు. శ్రమతో వచ్చే ఫలితం తృప్తినిస్తుంది, మంచి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది అన్నారు. సైరైన సమయంలో కష్టపడే వారు ఉన్నత స్థానాలకు చేరుతారు, సరైన సమయంలో కష్టపడని వారు వెనుకాపడుతారు. యువత శ్రమించడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి అని కోరారు. సమాజంలో ఉన్న సామాజిక అంశాల పట్ల, సామాజిక రుగ్మతల పట్ల యువత, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి అని సూచించారు. రోడ్డు భద్రత అరైవ్ అలైవ్ ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు, యువత దేశాభివృద్ధికి ఉపయోగపడే వనరు, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి, వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి, హెల్మెట్ ధరించాలి, రోడ్డు పై ఉన్న చుట్టూ పరిస్థితులు గమనించి సురక్షిత గమ్యం చేరాలి. డిఫెన్సివ్ గా వాహనాలు నడపాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ సైదారావు, వాసుదేవరావు, వేణుగోపాల్, నాగిరెడ్డి, మారం వెంకట్ రెడ్డి, యాదవరెడ్డి, సత్యం బాబు, భగవాన్ రెడ్డి, విద్యార్థులు, ఉపాద్యాయులు ఉన్నారు.



