విద్యార్థులకు సర్పంచి నగదు బహుమతులు
విశ్వంభర,ఇనుగుర్తి: మండలంలోని కోమటిపల్లి జడ్పీహెచ్ఎస్ లో2024-25 విద్యా సంవత్సరంలో 10వ,తరగతిలో ప్రథమ స్థానం సాధించిన బాలిక సంజన తల్లి సైజ శైలజ కు రూ.2,000లు,ద్వితీయ హిందూ కు రూ. 1,000 స్థానిక సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ అందజేశారు. స్థానిక హైస్కూల్లో 10వ,తరగతి స్టూడెంట్స్ కు తొమ్మిదవ తరగతి విద్యార్థులు బుధవారం ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఆయన హాజరై సంబంధిత నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సం.లుగా ప్రతి సంవత్సరం వీడ్కోలు సమావేశంలో వీడ్కోలు పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులకు టెన్త్ లో అధిక మార్కులు సాధించడానికి ప్రేరణగా ఈ పరంపర కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు వీడ్కోలు పొందుతున్న స్టూడెంట్స్ ను ఉద్దేశించి సర్పంచి మాట్లాడుతూ ఎక్కడ చదివినా ఏకాగ్రతతో చదివి ఉద్యోగాలు సంపాదించి కన్న వారికి, జన్మనిచ్చిన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం హాల్ టికెట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో హెచ్ఎం కళ్లెం వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కూరెల్లి సతీష్, మాజీ సర్పంచి నీలం యాకయ్య, ఉపాధ్యాయులు రంగయ్య, రాజయ్య,మాధవ్,యాదగిరి,శ్రీనివాస్, రెడ్డి,మధుకర్,బలరాం తదితరులు పాల్గొన్నారు.



