జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక.
On
విశ్వంభర, వరంగల్ :- జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంబేద్కర్ భవన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జన శిక్షణ సంస్థాన్ చైర్మన్ ప్రకాష్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రఘు తో పాటు ఇతర బోర్డు సభ్యులు పాల్గొని వృత్తి విద్యా కోర్సుల్లో ట్రైనింగ్ పొందిన 800 మహిళలు సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో భాగంగా జన శిక్షణ సంస్థాన్ ట్రైనీలు నేర్చుకున్న నైపుణ్యాలను స్టాల్ల్స్ రూపంలో exhibition ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి సతీష్ రెడ్డి గారు ఈ స్టాల్ల్స్ ను సందర్శించి ట్రైనీల ప్రతిభను అభినందించారు.జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహ మూర్తి ఈ వేడుకలో మహిళలు వ్యాపారవేతలు గా ఎదగడానికి గల ప్రభుత్వ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం జన శిక్షణ సంస్థాన్ వారి కృషి అభినందనీ యమని ప్రకాష్ గౌడ్ గారు హర్షం వ్యక్తం చేశారు. జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఖాజా మసియూదీన్ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి విరించడం జరిగింది.ఈ వేడుక మహిళల సన్మానాలతో ముగిసింది. ఈ కార్యక్రమం లో జాతీయ యూత్ అవార్డి ఏ మధు, మై భారత్ డైరెక్టర్ అన్వేష్, జాతీయ యూత్ ఐకాన్ శ్రీజ, బోర్డు సభ్యులు కె రాణి, సఖి కేంద్రం సభలు హైమవతి, జన్ శిక్షణ సంస్థాన్ స్టాఫ్ మరియు ట్రైనర్లు పాల్గొన్నారు.



