మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం
పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య
విశ్వంభర, సూర్యాపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రక్షణ అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం దీనిలో భాగంగా అరైవ్ - అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. సూర్యాపేట పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటయ్య వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, నేరమని తెలిపారు. జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం మత్తు వల్ల ఎదుటివారి కూడా ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసు సూచనలను పాటించాలని అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో నిత్యం మద్యం మత్తు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.



