ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన


  • విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీటనిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 

విశ్వంభర, నిజామాబాద్ : ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీ లో ఉపముఖ్యమంత్రి,ఆర్థిక శాఖ మాత్యులు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం డిచ్ పల్లి మండలం సుద్దులం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు, రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని.. విద్య,వైద్యం, వ్యవసాయానికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని త్వరలో ధర్పల్లి మండల కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్నివర్గాల ప్రజల ప్రయోజనార్థం "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం" ద్వారా 1 కోటి 15 లక్షల మందికి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఇది అనుకోని సంఘటనల్లో కుటుంబాలు చిద్రంకాకుండా ఆదుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు బెషజాలలు లేకుండా అన్ని రంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అనేది హర్షించదగ్గ విషయమని కొనియాడారు. యావత్తు తెలంగాణ ఉద్యోగులు దీన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పోషకాహారం అందించడంలో భాగంగా బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు తో పాటు అటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం తమ ప్రభుత్వ దార్శనికత్వానికి నిదర్శనమన్నారు. ఇలా అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ స్వాగతనీయమన్నారు. ఈ సమావేశంలో ఏఎంసి చైర్మన్ ముప్ప గంగారెడ్ పల్లి పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,నాయకులు పొలసాని శ్రీనివాస్, బాబు,రాంచందర్ గౌడ్, శ్యామ్ సన్, ధర్మగౌడ్,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: