ఘనంగా రంజాన్ వేడుకలు

ఘనంగా రంజాన్ వేడుకలు

విశ్వంభర, కేసముద్రం: మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్థిని హైస్కూల్లో ముందస్తు రంజాన్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం  ఆధ్యాత్మికత, ఉపవాస దీక్ష ప్రాముఖ్యత, సహనం  దాతృత్వం వంటి విలువలను వివరించారు. రంజాన్ మనుషుల మధ్య సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags: