స్వచ్ఛ సర్వేక్షన్లో ప్రజలు భాగస్వాములు కావాలి
- మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
విశ్వంభర, సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ లో సూర్యాపేట పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని, సూర్యాపేట పట్టణాన్ని మరొక్క సారి జాతీయ స్థాయిలో గుర్తింపు తేడానికి సహకరించాలి అని మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని సద్ధుల చెరువు కట్ట పై వాకర్స్ తో ఏర్పాటు చేసిన స్వక్ష సర్వేక్షన్ అవైర్ నెస్ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఇండ్లలోని తడి -పొడి, హాని కరమయిన చెత్తను వేరు చేసి ఇవ్వాలి అన్నారు. మురికి కాలువలలో చెత్త చేదారం వేయవొద్దు అని తెలిపారు.. పరిసరాలను పరిశుభ్రముగా వుంచు కోవాలి అన్నారు, మున్సిపల్ కమీషనర్ సియేచ్. హన్మంత రెడ్డి మాట్లాడుతూ 2026లో సూర్యాపేట ను జాతీయ స్థాయిలో ముందు ఉంచుటకు ప్రజలు సహకారం, సలహాలు సూచనలు ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమములో వైస్ ఛైర్పర్సన్ యండి. షఫీ ఉల్లా, కౌన్సిలర్ కుమ్మరి కుంట్ల వేణు, గుణగంటి హేమ సతీష్,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, డి. ఇ సత్యారావు, జూనియర్ అసిస్టెంట్ యండి గౌసుద్దిన్,ఎస్. ఎస్. ఆర్. ప్రసాద్,టీఎంసీ శ్వేత, టెక్నీకల్ పర్సన్ రంజిత్ కుమార్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.



