వెంకటేష్ కు దళితరత్న పురస్కారం .
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మండలం , అయోధ్య గ్రామానికి చెందిన సామాజిక బహుజన దళిత ఉద్యమ నాయకులు, గ్రామీణ వైద్యులు హెచ్ వెంకటేష్ ను దళిత రత్న పురస్కారం వరించింది . భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని హైదరాబాదు రవీంద్ర భారత్ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం సంబంధిత అవార్డును వెంకటేష్ కు ప్రకటించింది . వ్యవస్థాపకులు జన్ను కనకరాజు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా డీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు డా.కొరిపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా వెంకటేష్ దళిత రత్న అవార్డు తీసుకున్నారు . ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తాను చేసిన సేవలను గుర్తించి తనకు ఈ అవార్డు ప్రకటించారన్నారు . దీంతో నాకు మరింత బాధ్యత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు . అవార్డు గ్రహీత వెంకటేష్ కు జిల్లా అధ్యక్షులు జినక రవీందర్, కనకపుడి వీరస్వామి,బొడ్డు గురవయ్య,మునగలేటి వీరస్వామి,మంద కుమార్,చకుక్కల రామకృష్ణ,పగిడి ముక్కుల విజయ్ కుమార్,కాంపాటి ఉపేందర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు .



