అంబేద్కర్ కన్న కలలు నిజం చేయాలి

అంబేద్కర్ కన్న కలలు నిజం చేయాలి

విశ్వంభర, బషీర్ బాగ్:  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అసోసియేషన్ ఫర్ పీపుల్ వుమెన్ రైట్స్ కన్వెన్షన్ రాష్ట్ర అధ్యక్షులు తక్ధీర్ కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  తక్దీర్ మాట్లాడుతూ, అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతునే అణగారిన వర్గాల మధ్య అంబేద్కర్ చైతన్యం తీసుకొచ్చారని  తెలిపారు. సమాజంలో  సమాన అవకాశాలకు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గం దోహదపడుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరితేనే అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని పేర్కొన్నారు.

Tags: