జంతువుల్లో సైతం సర్జికల్ స్టాప్లర్ పిన్స్

జంతువుల్లో సైతం సర్జికల్ స్టాప్లర్ పిన్స్

  •  కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల లో తొలిసారిగా ప్రయోగం
  • సురక్షితం, సులభతరం సమయం, శ్రమ ఆదా
  • అసిస్టెంట్ డైరెక్టర్  ⁠డా .పి.పెంటయ్య  

విశ్వంభర, కోదాడ : కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో గేదె అరల పొట్టకి నిర్వహించిన శస్త్ర చికిత్సలో చర్మానికి జంతువుల్లో తొలిసారిగా సర్జికల్ స్టాప్లర్ పిన్నులను అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య ఉపయోగించారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, పౌర వైద్యంలో చాలాకాలం నుండి వాడకంలో ఉన్న ఈ పిన్నులను జంతువుల్లో వాడటం వలన అనేక లాభాలు ఉన్నాయన్నారు. ఆపరేషన్లలో మాములుగా నైలాన్, కాటన్, అక్రిల్ వంటి దారాలతో చర్మం కుట్లు వేస్తామని , ఒక్కోసారి వైద్యులకు సైతం సూది గాయాలవుతాయని, చర్మానికి ఎక్కువ సూది పోట్లు, దారం తెగిపోయే అవకాశం గాయం మానడానికి ఎక్కువ సమయం తో పాటు గాయం పరిమాణం బట్టి కుట్లకు ఎక్కువ సమయం పడుతుంది అన్నారు. అదే సర్జికల్ స్టాప్లర్ పిన్నులు స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై సురక్షితమైనవిగా ఉండడమే కాక, క్షణాల్లో గాయాన్ని మూసివేయవచ్చని, అన్ని ఒకే మాదిరిగా పటుత్వంగా ఉండి గాయం విడిపోకుండా ఉంటుందని, త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది అన్నారు.చిలుకూరు మండల కేంద్రానికి చెందిన రైతు పాడిగేదే 45 రోజులుగా అజీర్తితో బాధపడుతుండగా ఈరోజు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పొట్ట శస్త్ర ద్వారా పొట్టలోని గ్యాస్ పట్టిన కసరు తొలగించి , పొట్ట శుభ్రపరిచి, ఆపరేషన్ గాయాన్ని మూసివేయడానికి చర్మానికి ఈ సర్జికల్ స్టాప్లర్ పిన్స్ వేశామని అన్నారు . మాములుగా 15 నుండి 20 నిమిషాలు పట్టే ఈ కుట్ల సమయం పిన్నులతో అర నిమిషం లో పూర్తవ్వడం తో , చాలా సమయం ఆదా తో పాటు పశువుకి బాధ , మత్తు ఔషధాలను తగ్గించగలిగామని , వైద్యులకు గాయాలయ్యే అవకాశమే లేదని అన్నారు . ఇన్ని మంచి లాభాలు ఉన్న ఈ పిన్నులనే ఇకనుండి శస్త్రచికిత్సల్లో వాడతామని తెలిపారు శస్త్ర చికిత్సలో సిబ్బంది చంద్రకళ, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: