ఉపాధి హామీ పనులు ప్రారంభం

ఉపాధి హామీ పనులు ప్రారంభం

విశ్వంభర, చింతపల్లి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను బుధవారం చింతపల్లి సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది ఇందిరమ్మ ఇళ్లు, మహిళ సమాఖ్య భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత నిస్తూ వేసవి దృష్ట్యా గ్రామాల్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు వేగవంతం చేసేందుకు అధికారులతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పనులలో పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ ఈకేవైసీ తప్పనిసరి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెహనా బేగం సిద్ధిక్ బాబా,  ఏపీవో శౌరిరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ మురళీమోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, వార్డు మెంబర్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Tags: