ఘనంగా అంబేద్కర్ జయంతి 

ఘనంగా అంబేద్కర్ జయంతి 

విశ్వంభర, బర్కత్‌పుర : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బర్కత్‌పుర రత్నా నగర్ బస్తీలో ఉత్సవాలు నిర్వహించారు. కన్వీనర్ మేడి వెంకటేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై అవగాహన కల్పించారు. సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతపై ఆయన ఆలోచనలు మార్గదర్శకమని వక్తలు పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.పి మురళీకృష్ణ, నలినీకాంత్, సన్నిత్ కుమార్, తండు లాలయ్య గౌడ్, రాజేష్ లాల్, సతీష్ చంద్ర గౌడ్, పాతకోటి మహేష్, జంగులు సాయిలు, విక్కీ, పప్పీ, బొట్టు సతీష్, బి వెంకటేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: