మూడవ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు
విశ్వంభర, మహబూబాబాద్ : నూకల రామచంద్రా రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడుకోలు సమావే శాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించే క్రమంలో భాగంగా వీడ్కోలును పొందడం ఆనవాయితీ , తృతీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి బాగా చదివి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే పీజీ మంచి పేరున్న విశ్వవిద్యాలయాల్లో చేయాలని సూచించారు. దానికోసం ఇప్పటినుంచే కష్టపడి చదవాలని సూచించారు ఆ క్రమంలో భాగంగా బాగా కష్టపడి పీజీ సీటు పొంది ఆ తర్వాత ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని పొంది తమ తల్లిదండ్రుల పేరును తాము చదువుకున్న కళాశాల పేరును నిలబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా తృతీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు అందరికీ వీడ్కోలు పలుకుతూ మీరు ఆయా రంగాల్లో ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ అందరిని అలరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ జూపూడి అనిల్ కుమార్ అధ్యాపకులు డాక్టర్ మసూద్ అహ్మద్, డాక్టర్ వి సాంబశివరావు, బి శ్రీనివాస్, డాక్టర్ బి వినోద్ కుమార్ , డాక్టర్ డి రాజశేఖర్, డాక్టర్ అన్నపూర్ణ డాక్టర్, బి హాతిరామ్, డాక్టర్ ఖాసీంషా, యం.సుమన్, డాక్టర్ పి యుగేందర్, యం వీరు, డాక్టర్ కే సుమలత, యం సంతోష్ కుమార్, జె రవితేజ , వై యాకయ్య,ఓ ఉదయ్ కుమార్, యన్ నరేష్, డి ఎస్ రామన్న మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



