వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు 

వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు 

  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన సమ్మర్ తాగునీటి యాక్షన్ ప్లాన్, కనీస వేతనాల అమలు పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలోని హ్యాబిటేషన్లను హ్యాండ్ పంపులు, సంపులు తదితర త్రాగునీరు అందించే సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని మిషన్ భగీరథ, ఇంట్ర, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, గ్రామపంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్, మున్సిపల్ తదితర ఇంజనీరింగ్ విభాగం త్రాగునీటి సరఫరాలో సమన్వయంతో కలిసి పని చేయాలని, సమస్యలు ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సిద్ధంగా ఉండాలని, అవసరం అయితే వాటర్ ట్యాంకుల ద్వారా  నీటిని సరఫరా చేయాలని సూచించారు.  గురువారం నిర్వహించబోయే మండల సభలో గ్రామస్థాయి మండల స్థాయి అధికారులు వాటర్ సప్లై సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన విద్యాసంస్థలు, ఆస్పత్రులు కాలేజీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరును అందించాలని మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ మిషన్ భగీరథ సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీలు, మున్సిపల్ పరిధిలలో ఏవైనా తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, స్థానిక వనరుల మేరకు త్రాగునీటిని అందించాలని, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో వివిధ విభాగాలు ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ, బిసి, అంగన్వాడి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్, తదితర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ సిబ్బందికి ప్రభుత్వ, జిఓ, రూల్స్, సూచనల మేరకు వేతనాలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, మిషన్ భగీరథ ఇంజనీర్ సురేందర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఈ ఈ లు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ అధికారులు, శ్రీనివాసరావు, శ్రీనివాస్, దేశీ రామ్ నాయక్, లేబర్ అధికారి, ఉపాధి కల్పన అధికారి రజిత, తదితరులు పాల్గొన్నారు.

Tags: