రామన్నపేట మండలవాసికి దళితరత్న అవార్డు

రామన్నపేట మండలవాసికి దళితరత్న అవార్డు

విశ్వంభర, రామన్నపేట: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న "దళిత రత్న" అవార్డులను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ మహా జననేత మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి నల్ల స్వామి మాదిగకు దళిత రత్న అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా ఇందుకు సహకరించిన వారికి నల్ల స్వామి మాదిగ కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: