డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్
On
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు. మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుండి మే 7 వరకు, వెబ్ ఆప్షన్ ఈనెల 30 నుండి వచ్చే నెల 8 వరకు చేసుకోవచ్చని అన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని కళాశాలలో చేరకుండా స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని అన్నారు. అన్ని అర్హతలు కలిగి అపార అనుభవం ఉన్న అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ లు, డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, విశాలమైన క్రీడామైదానం, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వంటి సకల సదుపాయాలు కలిగిన కళాశాలలో తప్పకుండా చేరాలని ఆమె అన్నారు.



