సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
On
విశ్వంభర, ఇనుగుర్తి: మానుకోట శాసనసభ్యులు డా.భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన సర్పంచి తమ్మడపల్లి కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు బుధవారం పంపిణీ చేశారు. తమ్మడపల్లి యాకయ్యకు రూ.77,500, బూర నాని తేజ్ కు రు.60,000 చెక్కులను సర్పంచి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ అనారోగ్య బాధితులకు ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆధునిక భావకవి శీలం రాజిరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.



