నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
- నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తినుకుంటున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. _నారాయణఖేడ్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యేడాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ శేట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ధ్యేయమని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మందుల నిల్వలు, పారిశుధ్యం, మరియు అధునాతన వైద్య పరికరాల లభ్యతపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
పేద ప్రజలు నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, డాక్టర్లు మరియు సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. హెచ్.డి.ఎస్ నిధులను ఆసుపత్రి అభివృద్ధి కోసం, అత్యవసర సేవల కోసం నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 9 నుండి 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన బాలికలందరికీ ఈ టీకా అందేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ వైద్యులు,కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



