పాత కక్షలతో వ్యక్తిపై దాడి
On
విశ్వంభర, చింతపల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరుసనగండ్ల యాదయ్య ఊరిలో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. చికెన్ బాకీ డబ్బులు వసూలు నిమిత్తం ఓ ఇంటికి వెళ్లి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కాటేపాక రవికుమార్, కాటేపాక ఇంద్ర కలిసి పాత కక్షలు మనస్సులో పెట్టుకొని యాదయ్య పై దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ టంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



