మండల సభ కు హాజరు కావాలి
On
విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పై మండల కేంద్రం ఇనుగుర్తిలో గురువారం అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పంచాయితీ కార్యదర్శులు ఆయా శాఖల అధికారులకు మండల స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బండారు పార్థసారథి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రైతు వేదికలో జరిగే మీటింగ్ కు ఉ.9: 30 గం.కు ప్రారంభమయ్యే సమావేశానికి సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు.సభ లో వివిధ ముఖ్య పథకాలు అమలు పురోగతి,సాధించిన విజయాలు,రైతు భరోసా,ఇతర పథకాల లబ్ధిదారుల సంఖ్య, ప్రజాప్రతినిధుల సందేశాలు, గుర్తించిన సమస్యలు,తీర్మానాలు తదితర అంశాలపై మీటింగ్ జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు.



