విద్యార్థినులకు రోడ్డు భద్రత పై అవగాహన
On
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి ఎస్సై గంగారపు కరుణాకర్ అరైవ్ అలైవ్ లో భాగంగా స్థానిక బాలికల గురుకుల విద్యాలయంలో రోడ్డు భద్రత నియమాలపై బాలికలకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ మేరకు తల్లిదండ్రులకు లెటర్లు రాయాలని సూచించారు.హెల్మెట్స్ ధరించకుండా బైక్ లు నడపవద్దని, కార్లలో వెళ్లే సమయంలో సీటు బెల్టులు పెట్టుకోవాలని, ఎరుపు లైట్ వెలిగినప్పుడు ఆగాలని, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్లాలనే ట్రాఫిక్ నియమాలు, జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలు ఆపడం వంటి జాగ్రత్తలను లెటర్ ద్వారా పేరెంట్స్ కు తెలుపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.



