వస్తా కొండూరులో 'పోషక పక్వాడ'
On
విశ్వంభర, గుండాల : వస్తా కొండూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐ సి డి స్ సూపర్వైజర్ మాట్లాడుతూ, తల్లులకు జంక్ ఫుడ్ పై అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్ వద్దు ఇంటి ఫుడ్డు ముద్దు. అలాగే సహజంగా దొరికే కూరగాయలతో మంచి పౌష్టికాహారాన్ని తయారుచేసుకొని తినడం ఎలాగ అనేదాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ గౌడ్ , ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నర్సిరెడ్డి ఆశాకార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడి టీచర్లు, పద్మ, రమ, రాజమణి పాల్గొన్నారు.



