ప్రయాణ సమయంలో నియమాలు పాటించండి
- జిల్లా కలెక్టర్ తేజస్ నాంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: ప్రయాణ సమయంలో రోడ్డు నియమాలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తల్లితండ్రులకు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమం సిటీ టాలెంట్ హై స్కూల్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ హాజరయ్యారు. రహదారి వినియోగంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి పట్టణ సి ఐ వెంకటయ్య, సూర్యాపేట ఎసిపి ప్రసన్న కుమార్, రవాణా శాఖ అధికారి జయప్రకాష్ రెడ్డి వివరించారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు తెలిపే కరపత్రాలు పోస్టర్లను అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కోరారు. రోడ్లపై ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నిర్లక్ష్యం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఎవరైనా తప్పుడు మార్గాలు సూచించిన తప్పుడు పనులకు ప్రోత్సహించిన వాటిని ఉపాధ్యాయుల దృష్టికి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులతో పాటు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్లపై తల్లిదండ్రులు ఆజాగ్రత్తగా ఉండడం వల్ల చాలా మంది పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. రోడ్డు నియమాల గురించి రోడ్లపై పాటించాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేయాలని హెల్మెట్ వాడడం సిట్ బెల్ట్ ధరించడం గురించి వివరించాలని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదు అనే విషయం గురించి తల్లిదండ్రులకు లేఖల ద్వారా తెలియజేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని సీట్ బెల్ట్ పెట్టుకుంటామని మద్యం తాగి వాహనాలు నడపమని తల్లిదండ్రుల నుండి పిల్లలు ప్రామిస్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో కలలు ఆశలు పెట్టుకుంటారని వీటిని నిజం చేయాల్సిన బాధ్యత పిల్లలపై ఉన్నదని అన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే రహదారులపై ప్రమాదాల సంభవించి మృత్యువాత పడతారని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే టప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలు అందించారు. ఈ సందర్బంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎసిపి ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎమ్మార్వో కృష్ణయ్య, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, విద్యా సంస్థల యాజమాన్యం కరెస్పాండంట్ ప్రకాష్, ప్రిన్సిపాల్ మురళీదర్ పోలీస్, ఆర్టీవో అధికారులు, సిబ్బంది ఉన్నారు.



