కూతురుతో కలిసి హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ

కూతురుతో కలిసి హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ

విశ్వంభర, మహబూబాబాద్: వాహనదారులు తప్పనిసరిగా రహదారి నియమాలను పాటించి, హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ శబరీష్ కోరారు. ‘అరైవ్ అలైవ్’ రహదారి ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహనాల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం, ఎస్పీ స్వయంగా తన కూతురుతో కలిసి హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించడానికి దోహదపడింది. ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ఈ ర్యాలీ ద్వారా ఎస్పీ  చాటిచెప్పారు.

Tags: