ప్రమాదాల పై అప్రమత్తంగా ఉండాలి
On
విశ్వంభర, పెద్ద శంకరంపేట: రహదారి ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి అన్నారు. బుధవారంపెద్ద శంకరంపేట లోని బాలికల ఉన్నత పాఠశాలలో రహదారి నిబంధనల అవగాహన సదస్సు ఏర్పాటుచేసి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యార్థులు సురక్షితంగా రోడ్డు దాటాలని, వారి తల్లిదండ్రులు తప్పక హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని, వాహనం ఎప్పుడు సీట్ బెల్ట్ ను ధరించేలా కుటుంబ సభ్యులను ఒప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



