హోన్నాజీపేట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

హోన్నాజీపేట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

విశ్వంభర, నిజామాబాద్: ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ , సీతయ్యపేట్, డిబి తండ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఏపీఎం మనోహర్, సర్పంచ్ మద్దికుంట ఆశావా బాబాన్న, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, విష్ణు, లత, పద్మ లత, సీతయ్యపేట్ వివో ఏ, అనసూయ, సర్పంచ్ గూగులొత్ సోనా, ఉప సర్పంచ్ గూగులోత్ స్వామి, ఏ పి ఎం మనోహర్, సెంటర్ ఇన్చార్జ్ జ్యోతి వసురామ్,  మహిళసంఘం అధ్యకులు బుల ,తండా పెద్ద గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: