పరిగి ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

పరిగి ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: పట్టణంలో నిర్వహిస్తున్న పరిగి ప్రీమియర్ లీగ్  క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రూ.50 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ,  క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని అన్నారు. నేటి జీవితంలో ఏదో ఒక క్రీడపై ఆసక్తిని పెంపొందించుకున్నట్లయితే రోగాలు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హనుమంతు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, యూసఫ్, కాంగ్రెస్ నాయకులు అశోక్, సర్వర్, కుమ్మరి స్వామి,టోర్నమెంట్ నిర్వాహకులు షోయబ్, వెంకటరామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: